బేగంపేట, మార్చి 8 : శ్రీ విద్య చదువుకి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. దాసారం బస్తీకి చెందిన అశోక్, మమత దంపతుల కూతురు శ్రీ విద్యకు ఆధార్ కార్డ్ లేదని స్కూల్ లో చేర్చుకోవడంలేదు. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బల్దియా అధికారులు దాసారం బస్తీలోని శ్రీ విద్య ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి ఆధార్ కార్డ్ మంజూరుకు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేశారు. శనివారం శ్రీ విద్యకు ఎమ్మెల్యే సర్టిఫికెట్ను అందజేశారు.
అమీర్పేట: బల్కంపేటలోని ఎస్ వీ మాణిక్ ఆర్కేడ్ నివాసితుల సంఘం ప్రతినిధులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను మాజీ కార్పొరేటర్ ఎన్ శేషు కుమారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత జలమండలి అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ఆదేశించారు.