హైదరాబాద్ : మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( MLA Talasani Srinivas Yadav ) ఆదివారం బేగంపేట డివిజన్ ఓల్డ్ కష్టమ్ బస్తీలో రేషన్ షాప్ ( Ration Shop ) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకులు పూర్తిస్థాయిలో ఇవ్వడం, గోధుమలు ఇవ్వడంలేదని రేషన్ లబ్ధిదారులు వెల్లడించారు. గోధుమలు ఎందుకు ఇవ్వడం లేదని నిర్వాహకుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఇస్తున్నామని చెప్పగా, ఇవ్వడం లేదని స్థానికులు చెప్పడంతో రేషన్ షాప్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు.

స్థానికంగా ఉన్న శ్రీ నల్ల పోచమ్మ ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నగేష్, అశోక్ యాదవ్, ప్రశాంతి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, ఆరీఫ్, నరేష్ తదితరులు ఉన్నారు.