హైదరాబాద్ : సికింద్రాబాద్(Secunderabad) ముత్యాలమ్మ ఆలయం(Mutyalamma statue) వద్ద జరిగిన ఆందోళన పై మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) స్పందించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. బస్తీ వాసులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ మూలంగా ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ విధ్వంసం పై ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉత్తర మండలంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి భయంకర సంఘటనను చూడలేదని, ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని అన్నారు.