కాచిగూడ,జనవరి 29 : భూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani) ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా తలసాని హాజరై మాట్లాడారు. కేవలం తొమ్మిదిన్నరేండ్ల కాలంలోనే నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారంటీలు(Six guarantees) అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడంతో ప్రజలు కాంగ్రెస్‌ను ఛీ కొడుతున్నారని అన్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలను చేపట్టిన బీఆర్ఎస్ పార్టీని త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధాత్రిక్ నాగేందర్బాబ్జి, బబ్లూసింగ్, అంటోని పాల్గొన్నారు.