మూసాపేట, అక్టోబర్19 : బీఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధితో జూబ్లిహిల్స్‌లో తమ అభ్యర్థి విజయం ఖాయమని నర్సాపూర్ శాసన సభ్యురాలు సునిత లక్ష్మారెడ్డి అన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధి ప్రేమ్‌నగర్, ఓల్డ్ శాస్త్రీనగర్లలో సునితా లక్ష్మారెడ్డి ఆదివారం మూసాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, ఎర్రగడ్డ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ పల్లవి మహేందర్ యాదవ్‌తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ..కాంగ్రెస్ రెండెళ్ల పాలనలో ప్రజలు విసిగిపొయారన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ద్వారానే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ప్రజలను మోసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో రానున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అర్థం అవుతుందన్నారు. ఏ బస్తీకి వెళ్లిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించే ఓటర్లు మాట్లాడుతున్నారని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితాగోపినాథ్ భారీ మోజార్టీతో విజయం సాధించడం ఖాయమని అమే అన్నారు. కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు డి. సంజీవ, మూసాపేట డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, షరీఫ్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.