వనస్థలిపురం, మార్చి 31 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం ఎల్బీ నగర్ నియోజకవర్గం నాయకులతో కలిసి ఆయన హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తాలో యాత్ర ప్రారంభం అవుతుందన్నారు.
అక్కడి నుంచి సాహెబ్‌నగర్‌లోని త్రినేత్రాంజనేయ దేవస్థానం వరకు శోభాయాత్ర సాగుతుందని తెలిపారు. భక్తి, శక్తి, ఐక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. హనుమాన్ భక్తులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.