దళితబంధు కింద మంజూరైన టెంట్హౌజ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సాయన్న
హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారుడు
బొల్లారం, జూలై 13: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు అసమానతలను రూపుమాపనున్న బృహత్తర పథకమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. బుధవారం దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన టెంట్ హౌజ్‌ను కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం ఆదర్శనగర్ కు చెందిన అందె శ్రీనివాస్‌కు టెంట్‌హౌజ్ సామగ్రిని అందజేశారు. అనంతరం టెంట్హౌజ్ను బొల్లారం అంబేద్కర్ నగర్లో ఎమ్మెల్యే సాయన్న లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితుల్లో ఆర్థిక సాధికారత,స్వావలంభన సాధించేందుకు దళిత బంధు దోహదపడుతుందన్నారు.దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదేనని పేర్కొన్నారు. దళితుల కుటుంబాలు ఆర్ధికంగా వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్‌నాథ్,టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి,ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.