పేదల పాలిట కల్యాణలక్ష్మి వరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే 20మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, ఆకుల హరికృష్ణ, పిట్ల నగేశ్, లతామహేందర్, తేజ్పాల్, కసిరెడ్డి నరేందర్రెడ్డి, నవీన్, కిరణ్కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. – కంటోన్మెంట్, ఆగస్టు 14