బడంగ్‌పేట, నవంబర్ 24: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య అని, ఆయన త్యాగం వెలకట్టలేమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందనచెరువు కట్టపై మీర్‌పేట కుర్మ సంఘం అధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య త్యాగాలను కొనియాడుతూ కళాకారులు పాటలు పాడి అలరింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య కనబర్చిన పోరాట పటిమను ఎప్పుడు మర్చిపోకూడదన్నారు. చందన చెరువు కట్టపై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు పోరెట్టి పద్మ భాస్కర్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, సిద్దాల లాడ్స్ బీరప్ప, సిద్దాల మౌనిక శ్రీశైలం, సిద్దాల పద్మ అంజయ్య, అర్కల భూపాల్ రెడ్డి ఏనుగు అనిల్‌కుమార్, నవీన్ గౌడ్, బొక్క రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహాన్, అర్కల కామేశ్‌రెడ్డి, రాజ్‌కుమార్, సిద్దాల భరత్ తదితరులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుంటే సమాజంలో మార్పు వస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇటీవల అకాల మరణం చెందిన నరేశ్‌కుమార్ కుటుంబాన్ని ఆమె ఆదివారం పరామర్శించారు. అనంతరం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏఅండ్ ఎం టూవీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరుఫున సమకూర్చిన రూ.20లక్షలను నరేశ్‌కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే చేతులమీదగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. ఆపదోలో ఉన్న వారిని ఆదుకున్న ఏఅండ్ ఎం టూవీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అర్కల భూపాల్ రెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, నాయకులు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ యాదవ్, సతీశ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.