బడంగ్‌పేట,సెప్టెంబర్23: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేశారని..చాలా ప్రాంతాల్లో ముంపు సమస్య తప్పిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ పరిధిలోని వినాయక హిల్స్ ,స్వేచ్ఛా నివాస్, 1వ డివిజన్ లోని సాయి బాలాజీ, నవయుగ కాలనీల్లో మంగళవారం ఆమె పర్యటించారు.
మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయక పోవడంతో డ్రైనేజీ పొంగుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. ఆమె మాట్లాడుతూ వరదలో ప్రజలు కొట్టుకుపోతున్నా ప్రభుత్వానికి ప ట్టింపు లేదని విమర్శించారు. ముంపు ప్రాం తాల్లో సహాయక చర్యలు చేయడంలో కాం గ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముంపు సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎన్డీపీ నాలాల ఏర్పాటుకు రూ.1250 కోట్లు కేటాయించిన గుర్తు చేశారు. మున్సిపల్ శాఖను రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకొని నిధులు కేటాయించలేక పోతున్నారని ఆమె ఆరోపించారు.