బడంగ్‌పేట, ఆగస్టు 10ః నగరంలో అనేక చోట్ల ఇప్పుడు ఏర్పడుతున్న వరద ముంపునకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్ఎన్డీపీ నాలా పనులను ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం వల్లే శనివారం భారీగా కురిసిన వర్షానికి నగరంలో అనేక కాలనీల్లో వరద నీరు వచ్చి చేరిందని ఆమె చెప్పారు. ఎస్ఎన్డీపీ నాలాలు ఏర్పాటు చేసిన కాలనీలలో ముంపు సమస్య లేదన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో వరద వల్ల ప్రభావితమైన పలు కాలనీల్లో సబిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అనేక కాలనీలో ముంపు భారీన పడేవన్నారు. ముంపు సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుక పోవడంతో మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా ముంపు సమస్యలను గుర్తించి ఎస్ఎన్డీపీ నాలాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
దాదాపుగా పనులు చివరి దశకు వచ్చిన సంధర్భంలో ప్రభుత్వం మారడంతో ఎస్ఎన్డీపీ పనులు నిలిపివేశారని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎస్ఎన్డీపీ నాలా పనులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పనులు మధ్యలోనే ఆగిపోవడం వలన సమస్య జటిలం అయిందని విమర్శించారు. కాగా, ముంపు సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
జలవలయంలో మిథిలానగర్
భారీ వర్షాల కారణంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్, సత్యసాయి నగర్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి ఎన్‌క్లెవ్, గడ్డం ఎన్‌క్లెవ్, గుర్రంగూడ తదితర ప్రాంతాలలో భారీగా ఇండ్లలోకి భారీగా వర్ద నీరు వచ్చి చేరింది. రాత్రంతా జనం జాగరణ చేయవలసి వచ్చింది. చాలా మంది ఇంటి పైకి ఎక్కి బిక్కు బిక్కు మంటే భయంతో ఉండి పోయారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిన్నట్లు కాలనీ వాసులు
ఆరోపిస్తున్నారు.