బడంగ్‌పేట: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నగరం నలుమూలలా అనేక కంపెనీలు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లిలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది.
అంతకుముందు జాబ్‌మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేసీఆర్ అనేక కంపెనీలు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పాండు, వైఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్ ప్రభాకర్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.