మల్కాజిగిరి, నవంబర్ 10 : రైల్వే గేటు( Railway gate) సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేటు(MLA Rajasekhar Reddy) సమస్యను పరిష్కరించాలని వాజ్పేయినగర్ యూత్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా నేరేడ్మెట్ రైల్వే లెవల్క్రాసింగ్ వద్ద తరచూ గేటు మూయడంతో వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు.
దీంతో స్కూల్స్, ఆఫీస్ వెళ్లే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్యూబీని నిర్మిస్తామని అన్నారు. ఆర్యూబీ నిర్మాణం వల్ల దాదాపు 150ఇండ్లకు నష్టం వచ్చేదని, అయితే డిజైన్లో మార్పులు చేపించడంతో దాదాపు ఆరు ఇండ్లకు ప్రభావం పడుతుందని అన్నారు. ఇండ్లకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో ఆర్యూబీ నిర్మాణపనులు చేపడతామని స్పష్టం చేశారు.