మల్కాజిగిరి, జనవరి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను సోషల్ మీడియాలో (Social media)ఎండగట్టాలని మల్కాజిరిగి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy )అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్లాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీలో జరుగుతున్న అవకతవకలను ఎత్తి చూపాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిపనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్న విషయాలను ప్రజలకు తెలిసేలా షోషల్ మీడియాలో వివరిం చాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని డివిజన్ల వారీగా ప్రణాళికతో ఎండగట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు ఎమ్మెల్యే దిశ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకుడు రాముయాదవ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.