పేదలకు వరం సీఎం సహాయనిధి
మండలంలోని హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన మణెమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు చికిత్స అందించడం కోసం నగరంలోని నిమ్స్ దవాఖానకు తరలించారు.
- ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
- ఎల్వోసీ అందజేత
శంషాబాద్ రూరల్, మార్చి 24 : మండలంలోని హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన మణెమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు చికిత్స అందించడం కోసం నగరంలోని నిమ్స్ దవాఖానకు తరలించారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఆర్థిక స్థోమతలేక పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ద్వారా ఎల్వోసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎల్వోసీ మంజూరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరంగా మా రిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ దవణాకర్గౌడ్, సర్పంచ్ వట్టెల సతీశ్‌యాదవ్,రమేశ్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీలకు అవార్డులు ప్రదానం
శంషాబాద్ రూరల్, మార్చి 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యా య పంచాయతీ వికాస్ పురస్కార్‌లను మండలంలోని 19 గ్రామ పంచాయతీలు 9 రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు వివిధ రంగాల్లో పని చేస్తున్న వాటిని గుర్తించి అవార్డులు అందజేశామన్నారు. అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి పనులు చేయాలని సూ చించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయ మ్మ, జడ్పీటీసీ తన్వి, వైస్ ఎంపీపీ నీలం, ఎంపీడీవో వసంతలక్ష్మి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

