సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు జూబ్లీహిల్స్‌లోని ఎర్రగడ్డ, వెంగళ్రావునగర్, యూసుఫ్‌గూడ డివిజన్లలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్‌పేటలోని ఏకే ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, సీతాఫల్మండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఫలక్‌నుమాలో హుండా బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మొజాంఖాన్ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు.