సికింద్రాబాద్, జూన్ 17 : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు వెంటనే దరఖాస్తులు అందించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. ప్రతి ఏటా బోనాలు సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి దేవాలయాలకు అలంకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే సంప్రదాయాన్ని పాటిస్తోంది అని గుర్తు చేశారు.
గత సంవత్సరం నిధులు పొందిన ఆలయాల నిర్వాహకుల దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారని వివరించారు. తమ ఆలయం లెటర్ హెడ్ తో పాటు ఆలయం ఫొటో, ప్రెసిడెంట్, సెక్రటరీ ఆధార్ కార్డు జిరాక్స్, ఆలయం బ్యాంక్ అకౌంట్ వివరాలు, నిధుల వినియోగం వివరాలతో యుటిలైజేషన్ సర్టిఫికేట్, రెండు రెవెన్యూ స్టాంప్స్ అందజేయాలని సూచించారు. గత సంవత్సరం పొందిన చెక్కు జిరాక్స్ కాపీని కూడా అందించాలన్నారు.