ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 9: బీసీ కులాల(BC castes) ప్రయోజనాలకు కృషి చేస్తున్నానని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్(MLA Padmara0 goud) అన్నారు. అన్ని బీసీ కులాలు సంఘటితంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. బౌద్ధనగర్‌లో గంగపుత్ర స్థానిక సంఘం(Gangaputra Sangam) నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వెనుకబడిన కులాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ వారిని తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా తాము బీసీల హక్కుల సాధనకు సహకరిస్తామని స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ సంఘం నూతన భవన నిర్మాణానికి పద్మారావు కూడా వ్యక్తిగతంగా తన వంతు విరాళం అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.