మల్కాజిగిరి, జనవరి 3: మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైలు విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యేను మౌలాలికి చెందిన నేతలు సన్మానించారు. వెంకటాపురం డివిజన్ భూదేవినగర్లో కల్వర్ట్ నిర్మాణపనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైలు వల్ల ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే వారితో పాటు నగరవాసులకు ఉపయోగంగా ఉంటుందన్నారు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22కిలో మీటర్లు రెండు వైపుల 45 కిలోమీటర్ల మెట్రో రైలును విస్తరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం మెట్రో రైలు ఆమోదం తెలుపడంతో పాటు ఫేస్-2 పార్ట్-బీ ప్రథమ ప్రాధాన్యత క్రమంలో మొదలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, అనిల్కిశోర్, ప్రభాకర్, జమేదార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.