మల్కాజిగిరి: మల్కాజిగిరి ప్రజలకు రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీని నిర్మించాలని నేతలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ గూడ్స్ రైళ్లతో పాటు లోకల్ రైళ్లు వెళ్తుండటంతో తరచూ గేట్లు మూసి వేయడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు కార్లు, ఆటోలు, బైకులు, ట్రాన్స్పోర్టు వ్యాన్లు నిలిచిపోతున్నట్లు గుర్తించామన్నారు. రైల్వే అధికారులతో సర్వే చేయించి కొత్తగా ఆర్యూబీలను నిర్మించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.