మల్కాజిగిరి, డిసెంబర్ 16: ప్రభుత్వ దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మల్కాజిగిరి నియోజక వర్గంలోని ప్రభుత్వ దవాఖానలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ.. ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహకు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరిలోని ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా ఆపరేషన్ థియేటర్లు, డయగ్నోస్టిక్ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, 5 పడకల డయాలసిస్ యూనిట్, ట్రౌమా కేర్ యూనిట్, సీటీ స్కాన్ సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలన్నారు.
నీటి సదుపాయం కోసం పవర్ బోర్ వెల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు లిఫ్ట్ తరచూ పాడవుతున్నదన్నారు. లిఫ్ట్ తరచూ పనిచేయక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, రోగుల అటెండర్ల కోసం బాత్రూంను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.