మేడ్చల్ రూరల్, జనవరి 31: ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, కాంగ్రెస్ అంటేనే మోసమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మూడు చింతపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్‌పల్లిలో,ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, నూతన్‌కల్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసి పెట్టారని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అరిగోస పడుతున్నారని ఆరోపించారు.
ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బం గారం, వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల పింఛన్ ఇస్తామని మోసం చేశారని తెలిపారు. రైతుబంధు ఎటుపోయిందో తెలియక రైతులు అయోమయంగా ఉన్నారని, ఫ్రీ బస్ పథకం ఇచ్చి బస్సులను బంద్ చేశారని తెలిపారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, పని చేసిన వారికే ఓటు వేయాలని కోరారు. ప్రజలు కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఆయన చేసిన అభివృద్ధితో తెలంగాణ ఆదర్శంగా రాష్ట్రంగా మారిందని, కానీ రెండేండ్లుగా ప్రజలు అన్ని విధాలుగా బాధపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు.నియోజకవర్గ ఇన్చార్జి మహేదర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మే డ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.