హైదరాబాద్ : చిన్నారుల్లో రక్తహీనతలేని(Anemic society) సమాజానికి కృషి చేద్దామని, 1-19ఏళ్ల వయస్సు పిల్లలు ప్రతి ఒక్కరు నులిపురుగుల నివారణ మందులను వేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy )పిలుపునిచ్చారు. గురువారం జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై మాట్లాడారు.
పిల్లల ఎదుగుదలలో లోపం సంభవిస్తే అనారోగ్యం పాలవుతారని, నట్టల నివారణ మందులు వేసుకుంటేనే రక్తహీనత పెరిగి పుష్టిగా ఉంటారని అన్నారు. అనంతరం జవహర్నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, డాక్టర్ శుష్మ, ప్రధానోపాధ్యయుడు అజామోహినుద్ధిన్, మున్సిపల్, ప్రభుత్వ దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.