మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 25 : మహిళలు అన్ని రంగాల్లో రాణించి, అర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. నాగారం మున్సిపాలిటీ ఎస్సీ కార్పొరేషన్, ప్రో ఫ్యాషన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందిన 70 మంది మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టుమిషన్లను(Sewing kits) మల్లారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగల్లో ముందుఉంటున్నారని తెలిపారు.
స్వశక్తితో ఎదుగుతూ విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. మహిళల అభ్యున్నతికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు 10 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్,కమిషనర్ రాజేందర్ కుమార్, కౌన్సిలర్లు, కో-అఫ్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.