కంటోన్మెంట్, ఏప్రిల్ 29: ‘నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా..ప్రధాని మోదీని కలిస్తే పార్టీ మారినట్లు కాదు’ అని మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ యువజన నేత టింకూ గౌడ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఎలాంటి సందేహాలకు తావులేదని, తనపై వస్తున్నవన్నీ అనవసర ప్రచారాలు మాత్రమేనని స్పష్టం చేశారు.