బాలానగర్, జనవరి 5 : సగరులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం బాలానగర్ సగర సంఘం(Sagara sangam) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర సంఘం వారు ఎల్లప్పుడు తనకు అండగా ఉంటారని సగరులకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. 2025 సంవత్సరానికి గాను కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రూపొందించిన క్యాలండర్‌ను ఆవిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.
కొత్త సంవత్సరంలో సగరులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. దినాదినాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సగరులు సమిష్టిగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. సమిష్టిగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు దిండు లోకేష్, జానకిరాం, ఆవుల రవి, గిరి సాగర్, రాజు సాగర్, అర్జున్, నాగరాజు, సురేందర్, గుంటి కృష్ణ, వెంకటలక్ష్మి, జయమ్మ, పూజ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.