బాలానగర్, సెప్టెంబర్ 26 : కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన మరమ్మతు పనులు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram)అధికారులను ఆదేశించారు. గురువారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం(Engineering Department), జలమండలి అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్కు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయా ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు కులుగకుండ ఉండడం కోసం వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి పైప్లైన్ సరిగ్గాలేక పోవడం కారణంగా తాగునీరు సమగ్రంగా రావడం లేదని ప్రజలు తనకు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే పండుగలు బతుకమ్మ, దసరా, దీపావళీ సందర్భంగా అన్ని విభాగాల అధికారులు సమన్వంతో పని చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడ పడుచులకు ఎలాంటి ఆటంకం కలుగకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.