బాలానగర్, సెప్టెంబర్ 2 : ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్‌పేట హరిజబస్తీ(Harija Basti )వాసులకు అండగా నేనుంటాను. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దాం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram )భరోసా ఇచ్చారు. సోమవారం హస్మత్‌పేట హరిజబస్తీలో డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి వారు పర్యటించారు. ఈ సందర్భంగా తాము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, నోటీసులు ఇచ్చి ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోవాలని పలువురు స్థానికులు ఎమ్మెల్యే కృష్ణారావును వేడుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హరిజనబస్తీవాసులు నిశ్చింతగా ఉండండి. మీకు నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇతర పార్టీల నేతలు కొందరు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఎఫ్టీఎల్ భూమిలో ఇండ్లు కట్టుకొని ఉన్నవారే హరిజనబస్తీలో నిరుపేదల ఇండ్లపై కన్నేసి హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వారి ఆటలు సాగబోవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. 45,50 ఏండ్లుగా హరిజనబస్తీలో ఇంటి నిర్మాణాలు చేపట్టుకొని నివాసముంటున్న వారికి అధికారులు నోటీసులు అందజేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.