బేగంపేట్, ఏప్రిల్ 5: మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలనిఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శుక్రవారం బేగంపేట మయూరీమార్గ్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూకట్పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశామన్నారు.
వీటితో పాటు బేగంపేట డివిజన్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలనూ పరిష్కరించినట్టు తెలిపారు. అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ హయాంలో పదేండ్ల కాలంలో నగరంలో ైఫ్లై ఓవర్లు, నాలాల అభివృద్ధి, ఐటీ రంగం, శాంతి భద్రతల పరిరక్షణ, సీసీ రోడ్లు, మురుగునీటి వ్యవస్థ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలో వచ్చి.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.