కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 22 : కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావులు జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇండస్ విల్లాస్ లో పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. వర్షపు నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా పకడ్బంగా పనులు చేయాలని సూచించారు. ఇండస్ విల్లాస్ వద్ద చేపట్టిన పనులను స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు అలసత్వం వహించడం తగదని హెచ్చరించారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే నిధులు తీసుకొస్తానని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డీఈ శంకర్, ఏఈ సాయి ప్రసాద్, జలమండలి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి రాజేశ్ రాయ్, వెల్ఫేర్ సభ్యులు, స్థానిక నేతలు ఉన్నారు.