40 వేల ఓట్ల తొలగింపు
కూకట్పల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ పేరుతో ఆక్రమంగా 40వేల ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ... కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పలు పొలింగ్ బూత్‌లలో ఎస్ఆర్ఐ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు.
- సర్‌పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణ
కేపీహెచ్‌బీకాలనీ, మే 15 : కూకట్పల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ పేరుతో ఆక్రమంగా 40వేల ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ… కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పలు పొలింగ్ బూత్‌లలో ఎస్ఆర్ఐ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు. బూత్ స్థాయిలో తనిఖీలు చేపట్టి ఓట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం ఫతేనగర్ డివిజన్లోని బూత్ నెంబర్ 351 నుంచి 366 వరకు గౌతంనగర్, మాధవినగర్, నాగార్జున కాలనీ, శోభనకాలనీ, పైప్‌లైన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సుమారు 40వేల ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించిన ఆధారాలతో కూకట్పల్లి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

