హైదరాబాద్ : నా మీద కోపంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi )చెక్కులు ఆపొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెపుతున్నారు. కానీ ఇవ్వడం లేదని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు పంపిణీ చేసే ఆనవాయితీ ఉంది.
కానీ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారని విమర్శించారు. నెల రోజులుగా మంత్రి రావడం లేదు, చెక్కులు ఇవ్వడం లేదు. నేను రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలన్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే తహసీల్దార్ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు.
నా మీద కోపంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపకండి
కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారు.
మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెపుతున్నారు కానీ ఇవ్వడం లేదు.
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్… pic.twitter.com/Y2zKw7G3nc
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024