MLA Krishnarao | బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే కృష్ణారావు
MLA Krishnarao | బీఆర్ఎస్తోనే(BRS) అభివృద్ధి సాధ్యమని, మల్కాజగిరి అభివృద్ధి కోసం రాగిడి లక్ష్మారెడ్డిని(Ragidi Lakshmareddy) గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishnarao) అన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 31 : బీఆర్ఎస్తోనే(BRS) అభివృద్ధి సాధ్యమని, మల్కాజగిరి అభివృద్ధి కోసం రాగిడి లక్ష్మారెడ్డిని(Ragidi Lakshmareddy) గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishnarao) అన్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని పీవీఎన్ఆర్ పార్కు, అంబేద్కర్ పార్కులో ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందన్నారు. నగరంలోని కాలనీలు, బస్తీలలో సమస్యలన్నింటినీ పరిష్కరించామని మెరుగైన మౌలిక వసతుల కల్పన వల్లే నగరం శరవేగంగా అభివృద్ధిని సాధించిందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులను ఆదర్శవంతంగా అభివృద్ధి చేశామని.. చేసిన అభివృద్ధి కండ్లముందు కనబడుతుందన్నారు.
గత ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించడం వల్లే ఎమ్మెల్యేగా విజయం సాధించానని, మరోమారు బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాలనీలు, బస్తీలలో సమస్యలను పరిష్కరించేంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అసోసియేషన్ నేతలు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

