కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 28 : కూకట్‌పల్లిలోని శ్మశాన వాటికలను(rematoriums) అదర్శవంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు(MLA Krishna Rao) అధికారులను ఆదేశించారు. మంగళవారం కూకట్పల్లి దయార్‌గూడ, ప్రశాంత్నగర్లలోని శ్మశాన వాటికను ఎమ్మెల్యే మాధవరం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చివరి ఘట్టంకోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
శ్మశాన వాటికలో స్నానపు గదులు, ప్రహరీ నిర్మాణం చేయాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కాలనీలు, బస్తీలలో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా మార్చాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఈఈ గోవర్ధన్, డీఈ నిఖిల్‌రెడ్డి, ఏఈ సునీల్, ప్రసన్న స్థానిక నేతలు ఉన్నారు.