హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఫోబియా(KTR phobia) పట్టుకుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivekananda) అన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక కేసులో అక్రమంగా ఇరికించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్లి వెళ్లి సెర్చ్ చేశారు.
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని వారి చేతిలో కీలు బొమ్మలాగా మారుతున్నారు. ఇది సరికాదన్నారు. రేపు మీరు రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టమని కేపీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని సూచించారు.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది.. కేటీఆర్ ఫోబియా పట్టుకుంది
స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారు
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను.. పోలీసులు ఇబ్బంది పెట్టారు
అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు… pic.twitter.com/siV9vKNFzu
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2024