హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పులకేసిలా సీఎం రేవంత్ తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన ప్రసంగంలో ప్రభుత్వ పనితీరు గురించి చెప్పాల్సి ఉన్నా.. అది మరిచి కేవలం కేసీఆర్, వారి కుటుంబంపై విమర్శలకే సమయం కేటాయించారని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌కు వ్యాపారాలు ఉన్నాయని.. అందుకే తరచూ ఆయన ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.