MLA KP Vivekanand | మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకుందాం
MLA KP Vivekanand | ప్రజాసేవలో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy)ని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్( MLA KP Vivekanand ) అన్నారు.
దుండిగల్,ఏప్రిల్18 : ప్రజాసేవలో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy)ని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్(
MLA KP Vivekanand ) అన్నారు. మల్కాజ్గిరి(Malkajgiri) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా గురువారం గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్,బేకరీ గడ్డ,ఎన్టీఆర్నగర్లో ఆయన స్థానిక కార్పోరేటర్, డివిజన్ అధ్యక్షులు, నాయకులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ఆయా ప్రాంతాలల్లోఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవులతో సంబంధం లేకుండా గత 20ఏండ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ఎన్నో ఉపాధి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే బస్తీలు, కాలనీలు రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతాయన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు మన ప్రాంతానికి చెందినవారే కాదు. ఇక మన సమస్యలు వారికి ఎట్లాతెలుస్తాయని, వారు వాటిని ఎట్లా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.పార్లమెంట్లో తెలంగాణ గొంతుకై నిలిచేందుకు లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

