దుండిగల్/కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 4 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలకు తానిచ్చిన హామీలను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో రంగారెడ్డిబండ, జొన్నబండలో 105వ రోజు ఎమ్మెల్యే ప్రగతియాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు ఎమ్మెల్యేకు మంగళహారతులతో స్వాగతం తెలిపారు. అనంతరం ఆయా కాలనీల్లో పూర్తి చేసిన అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేర్చడంతో చాలా సంతృప్తిగా ఉందన్నారు. ప్రజలకు భూగర్భడ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కరెంటు పోల్స్, తీగలు మార్చాలని వచ్చిన పలు సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయా కాలనీల ప్రజలు వివేకానంద్‌ను మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, పార్టీ సీనియర్ నేత సంపత్మాదవ్రెడ్డి, గుమ్మడి మధుసూదన్‌రాజు, కుంట సిద్ధిరాములు, మఖ్సూద్ అలీ, కాలే నగేశ్, అనిల్, గణేశ్, మహిళా నాయకురాలు ఇందిరారెడ్డి, బస్తీవాసులు రామిరెడ్డి, లక్ష్మయ్య, ముంతాజ్, రుక్కమ్మ, యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.
సూరారం డివిజన్, నెహ్రూనగర్‌లో రూ.48 లక్షల వ్య యంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మా ణ పనులకు సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొడ్డు వెంకటేశ్వర్రావు, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు. పార్టీ శ్రేణులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను కలిసి.. తమ కాలనీల్లో మౌలిక వసతులపై వినతిపత్రాన్ని అందించారు. స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల పూర్తిపై ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.