KP Vivekanand | పచ్చదనంతోనే సంపూర్ణ ఆరోగ్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
KP Vivekanand | పచ్చదనంతోనే మానవాళి మనుగడకు దోహదం చేకూరుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరా ప్రాంతాల్లో మొక్కను నాటి దానిని సంరక్షించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పిలుపునిచ్చారు.
కుత్బుల్లాపూర్,జూలై23 : పచ్చదనంతోనే మానవాళి మనుగడకు దోహదం చేకూరుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరా ప్రాంతాల్లో మొక్కను నాటి దానిని సంరక్షించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పిలుపునిచ్చారు. మంగళవారం జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్‌లో వెల్ఫేర్ అసోషియేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ(Vanamahostav) కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానవాళి మనుగడ సాధించాలంటే మొక్కలు పెంచాలన్నారు.
పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే అడవులను కాపాడుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు అందమైన పుడమిని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి కె. నాగేంద్ర బాబు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్దిరాములు, సుధాకర్‌గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎల్లాగౌడ్, విజయహరీశ్, కాలే నగేశ్, సంజీవ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సాగర్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

