దుండిగల్,ఆగస్టు 10 : కాలనీలు, బస్తీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా గురువారం 97వ రోజు ఎమ్మెల్యే వివేకా నంద్ .. సూరారం డివిజన్లోని విశ్వకర్మకాలనీలో అధికారు లు, స్థానికనేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.48లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గతంలో తాను చేపట్టి, పూర్తి చేసిన పనులను పరిశీలించారు. అదే సమయంలో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ..
డివిజన్ పరిధిలో ఇప్పటికే రూ.3కోట్ల 88లక్షల వ్యయంతో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీ, మంచినీటి వసతి వంటి వసతులను కల్పించినట్లు తెలిపారు. తమబస్తీలో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినందుకుగాను స్థానిక మహిళలు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేకు మంగళహారతులతో ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ డీఈఈ శిరీష, ఏఈ సంపత్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మన్నేరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, సీనియర్ నాయకులు ఇంద్రసేనగుప్తా, వారాల వినోద్‌కుమార్, మన్నే బాలేశ్, కొండకళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సదానందం, మక్సూద్‌అలీ, మహిళా నేతలు షెహనాజ్, లత, భారతి, కవితపాటు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,17వ డివిజన్ పరిధి, బాచుపల్లి కౌసల్య కాలనీ, మహావిల్లాస్లో మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఎన్డీపీ నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం 19వ డివిజన్లోని రైసీనియా ఇంటెల్లిపార్క్ క్లబ్‌హౌస్‌లో స్థానికులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. బాచుపల్లి చౌరస్తాలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు స్థానికుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కా ర్పొరేటర్లు ఆగం రాజుముదిరాజు, కాసాని సుధాకర్ ము దిరాజు, విజయలక్ష్మి, చిట్ల దివాకర్, సురేశ్‌రెడ్డి, సుజాత, బాలాజీనాయక్, ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఆగంపాండు ముదిరాజు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయప్రసాద్తో పాటు ఎస్ఎన్డీపీ, హెచ్ఎండీఏ అధికారులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.