బీఆర్ఎస్ అంటేనే..అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
- మళ్లీ కేసీఆర్ సర్కార్ రావాలి.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలి..!
- పదేండ్లలో రూ.6వేల కోట్లతో అభివృద్ధి చేశా
- కుత్బుల్లాపూర్ అప్పుడెట్లుండే..ఇప్పుడట్లైంది..?
- ప్రజలు బేరీజు వేసుకొని ఓటు వేయాలి
- ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
దుండిగల్, నవంబర్ 24 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ విజయశేఖర్గౌడ్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా జీడిమెట్ల డివిజన్లోని స్పింగ్ఫీల్డ్ కాలనీలో, గాజులరామారం డివిజన్ పరిధిలో కార్పొరేటర్ రావులశేషగిరిరావుతో, చింతల్ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్య్ర భారతంలో 75ఏండ్ల కాలంలో జాతీయ పార్టీలు చేయలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధే ఇందుకు సాక్ష్యమన్నారు. ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే రూ.6వేల కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో కుత్బుల్లాపూర్ ఎట్లుండే…? ఇప్పుడు ఎట్లుంది..? అనే అంశాలను ప్రజలు బేరీజు వేసుకొని ఓటు వేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరుగాలన్నా.., సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటువేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పే కల్లబొల్లి మాటలు విని మీ విలువైన ఓటును వృథాచేయవద్దని తెలిపారు. వివేకానంద్ ప్రచారానికి విశేషస్పందన లభించింది. అడుగడుగునా మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంతరావు, దూదిమెట్ల సోమేశ్యాదవ్, మహ్మద్ మక్సూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

