కుత్బుల్లాపూర్,సెప్టెంబర్2 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అధికారులను ఆదేశించారు. సోమవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు నరసింహా, మల్లారెడ్డిలతో పాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు వీధులన్నీ శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకై స్ప్రే చేయించాలని పేర్కొన్నారు. నిల్వ నీరు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శిథిలా వస్థ లో ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని శాఖల అధి కారు లతో సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.