అంబర్‌పేట, ఫిబ్రవరి 24 : వేసవితో ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. తాగునీటికి ఇబ్బందులు రా కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ తురాబ్‌నగర్‌లో బస్తీ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో బో ర్వెల్ను వేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆయన శుక్రవారం బోర్వెల్ పనులను ప్రారంభించారు. అనంతరం బసీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో కొన్ని చోట్ల వీధి దీపాలు, కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు చెప్పారు. అలాగే బస్తీలో రోడ్డుకు దగ్గరగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటుకు మార్చాలని, ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని ఆయన దృష్టికి తెచ్చారు. వీటికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలలో ఇలాంటి బోర్లు వేయించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోర్లు వేయిస్తున్నట్లు వెల్లడించారు. అడిగిన వెంటనే స్పందించి బోరు వేయించి నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యేకు తురాబ్‌నగర్ బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు శ్రీరాములు ముదిరాజ్, అఫ్రోజ్పటేల్, రమేశ్‌నాయక్, మిర్యాల రవీందర్, పంజాల చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.