అంబర్‌పేట, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్‌పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్కు చెందిన జమ్మిచెట్టు బాల్‌రాజు బీజేపీలో డివిజన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాల్‌రాజుతో పాటు మరో వందమంది స్థానికులు, మహిళలు కూడా బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని చెప్పారు. కొన్నేండ్లుగా పనిచేస్తున్న వారు నిరాశతో బయటకు వచ్చి తమ బస్తీలు, కాలనీలను అభివృద్ధి చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో 15 ఏండ్లు ఎమ్మెల్యేగా, మూడేండ్లుగా కేంద్ర మంత్రిగా పని చేస్తున్న జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేటను పూర్తిగా విస్మరించారన్నారు.
తన ఎంపీ నిధులను ఖర్చు చేయకపోవడంతో అవి మురిగిపోతున్నాయని వెల్లడించారు. సాయిమధురానగర్లో స్థానికుల కోరిక మేరకు ఒక కమ్యూనిటీహాల్‌ను నిర్మిస్తామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో ఎ.రాములు, ఎం.రాజు, కె.రాజు, టీవీ శేఖర్, శ్రావణ్, దుద్యాల శివ, తిరుమని వెంకట్, మురళీ, శేఖర్, సందీప్, ప్రణయ్, గురు, అరవింద్, ప్రసాద్, కుమార్, మల్లేశ్, వెంకటా చారి, కృష్ణ, మహిళలు వేదవతి, మీనా, రేఖ, వరలక్ష్మి, ధనలక్ష్మి, రూప, రోహిణి, పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు రవీందర్రావు, కోట్ల సంతోష్, రమేశ్ నాయక్, మిర్యాల రవీందర్, అరుణ్‌రెడ్డి, సి.మల్లేశ్ యాదవ్, శివాజీ యాదవ్, బి.నర్సింగ్ రావుయాదవ్, ఇ.ఎస్.ధనుంజయ, విజయ్, సునీల్, నవీన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.