అంబర్‌పేట, ఆగస్టు 10 : అంబర్‌పేట నియోజకవర్గంలో మంచినీటి సమస్య తల్తెకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ కుర్మబస్తీలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.13 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్‌లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలోని అన్ని బస్తీలు ,కాలనీల్లో మొదటి ప్రాధాన్యతగా మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ పనులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులకు అదనంగా మరో రూ.18 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు.
వీటితో మంచినీటి, డ్రైనేజీ పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని కాలనీలు, బస్తీలలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేశామని, అవసరమైన చోట వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ డీజీఎం విష్ణువర్దన్‌రావు, మేనేజర్ మాజీద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, పి.గెల్వయ్య, కనివేట నర్సింగ్‌రావు, అరుణ్కుమారెడ్డి, నవీన్‌యాదవ్, సాయిరాం, ఇ.ఎస్.ధనుంజయ, తేజావత్ రమేశ్, కెంచె మహేశ్, బొట్టు శ్రీను, బంగారు శ్రీనివాస్, జె.బాల్‌రాజు, శ్రీహరి, శేఖర్, కిశోర్, క్రాంతి, స్వామి, కుమారస్వామి, బీజేపీ నాయకులు చుక్క జగన్, అచ్చిని రమేశ్, మహేశ్, గోవిందు అర్జున్, ఎ.అంజయ్య, అరెందర్, రఘునంన్ పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్ మండల నూతన తాసీల్దార్‌గా డి. సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అంబర్‌పేట : పేదలు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉద్దేశించిన గృహలక్ష్మి పథకానికి అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మళ్లీ ఇక్కడే ఇవ్వాలని చెప్పారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్ కాఫీలను జతపరచాలని తెలిపారు. నియోజకవర్గానికి మొత్తం మూడువేల ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సొంత స్థలం, పెంకుటిల్లు, రేకుల ఇల్లు గలవారు అర్హులన్నారు. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం జతపర్చాలని చెప్పారు. లబ్దిదారులకు పునాది తీసిన తర్వాత లక్ష, స్లాబు సమయంలో లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష మొత్తం మూడు లక్షలు ఇస్తారన్నారు. పది రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.