అంబర్‌పేట, మే 13 : సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట్లు ఇస్తే మూసీని ప్రక్షాళన చేసి అతి సుందరంగా తయారు చేయవచ్చని చెప్పారు. ఆటో యూనియన్ నాయకుడు శివకుమార్గుప్తా, జేఏసీ నాయకులు జగదీశ్ సూర్యవంశీ, జహంగీర్ సూర్యవంశీ తమ నాయకులతో కలిసి శనివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జె.భాస్కర్‌గౌడ్, బీఆర్టీయూ నాయకుడు పోలె నిరంజన్ ఆధ్వర్యంలో బాగ్‌అంబర్‌పేట డివిజన్ రెడ్‌బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిషన్‌రెడ్డి నాలుగేండ్లుగా కేంద్రమంత్రిగా ఉంటూ ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా? అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, పుట్‌పాత్‌ల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుకు చర్యలతో పాటు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, దళితబంధు వంటి వాటికి మొత్తం రూ.250 కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వచ్చే రెండు నెలల్లో నియోజకవర్గంలో 3 వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరో 3 వేల మందికి గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వనున్నట్లు చెప్పారు.
దళితబంధు రెండో విడతలో 1100 మందికి గ్రాంట్ కింద సహాయం చేయనున్నట్లు చెప్పారు. ఆటో యూనియన్ నాయకులు ఎస్.రామకృష్ణ, యాదవరెడ్డి, మున్నాభాయ్, జైహింద్‌గౌడ్, కృష్ణయాదవ్, వెంకటేశ్, శ్రీనివాస్, ఎల్లయ్య, మల్లయ్య, శంకర్‌గౌడ్, రమేశ్‌గౌడ్, రవీందర్‌గౌడ్, ఫయాన్, సోమయ్య, రామస్వామి తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అఫ్రోజ్పటేల్, పి.గెల్వయ్య, ధనుంజయ, దారయోబు, ఉప్పు సుధాకర్, బాల్‌రాజు, శ్రీహరి, కిశోర్, అవినాశ్‌గౌడ్, మహేశ్, దిలీప్, బంగారు శ్రీను, నరహరి, శివ తదితరులు పాల్గొన్నారు.