గోల్నాక, జూన్ 6 : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్ పేట నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆయన ఆకాంక్షించారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలన్నారు.
బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని కాలేరు వెంకటేశ్ తెలిపారు. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు నియోజకవర్గంలోని మజీదులతో పాటు ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.