హైదరాబాద్ : బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చే నంబర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..బండి సాయి భగీరథ్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే దానిని హనీ ట్రాప్ గా కేసు నమోదు చేసి నిర్వీర్యం చేశారన్నారు. దీంతీ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని వస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయని ఆరోపించారు.
ఈ ఘటనకు బాధ్యత వహించి బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంతవరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.