ఎల్బీనగర్, అక్టోబర్ 28 : ఎల్బీనగర్ నియోకవర్గం పరిధిలో ఎస్ఎన్డీపీ(SNDP) పనులు పూర్తి సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devi Reddy) అన్నారు. ఎల్బీనగర్ నియోకవ ర్గంలోని లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ధర్మపురి కాలనీతో పాటుగా పరిసర కాలనీల్లో నిర్మించిన ఎస్ఎన్డీపీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి వర్షానికి కూడా కాలనీలు జలమయం అయ్యేవని, ఎన్ఎన్డీపీ పనులు పూర్తి చేసిన నేపథ్యంలో కాలనీలన్నీ సురక్షితంగా మారాయని అన్నారు.
ఎల్బీనగర్ నియోకవర్గం వ్యాప్తంగా ముంపు ప్రాంతాలన్నీ ఎస్ఎన్డీపీ పనులతో సంపూర్ణంగా ముంపు నుంచి విముక్తి అవుతున్నాయన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తయితే ఎల్బీనగర్ నియోజకవర్గం ముంపు రహిత ప్రాంతంగా మారుతుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిలక్‌రావు, సుజిత్, చిత్రంసాయి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.