బంజారాహిల్స్,నవంబర్ 16: పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేసుకుంటేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుకునే అవకాశం ఉంటుందని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని గౌరీశంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు దానం నాగేందర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సాయం చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని , గృహలక్ష్మి కింద నియోజకవర్గంలో 3వేలమందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. ఇప్పటికే సుమారు 3వేలమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందని, ఎన్నికలు పూర్తయిన తరువా మరో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఫైజల్ జాబ్రి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, బస్తీ అధ్యక్షుడు కే.ముత్తు, సతీష్, మహేశ్వర్‌రెడ్డి, రాము, ప్రేమ్, జావెద్, జెట్టి విజయ్‌కుమార్, ఆంథోనీ , జయలక్ష్మి, శౌరీరాజు తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 16 : అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవించే ప్రశాంత హైదరాబాద్ నగరం కావాలా, రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీల పాలన కావాలా అనే విషయాన్ని ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ డివిజన్ తబేళా బస్తీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తబేళాబస్తీలో ఏర్పాటు చేసిన సభలో దానం నాగేందర్ మాట్లాడుతూ పదేండ్ల క్రితం వరకు హైదరాబాద్ అంటే కర్ఫ్యూలు, కత్తిపోట్లు, కరెంటు కష్టాలు గుర్తొచ్చేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన పాలనలో ప్రస్తుతం హైదరాబాద్ అంటే అభివృద్ధితో పాటు గంగా జమునా తహజీబ్ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు.
స్వార్థరాజకీయాల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే సంస్కృతి కాంగ్రెస్, బీజేపీలదైతే పేదల ఆకలి తీర్చే మనస్సున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే గుర్తించిన కాంగ్రెస్ ఓ వైపు ఉంటే, పేదరికంతో బాధపడే మైనార్టీలకు వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించి, వారికి నాణ్యమైన విద్యనందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రెండో వైపు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ గుప్తా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఫైజల్ జాబ్రీ, హర్షద్, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, నాయకులు నాగేశ్వర్ రావు, మెట్టు రాజు, ఎంఎస్ రెడ్డి, త్యాగరాజు, జగన్‌దాస్, జహంగీర్‌తో పాటు తబేళా బస్తీ నేతలు మహ్మద్ అఫ్సర్, ఇలియాస్, మహమూద్, రహమత్, మోసిన్, కబీర్, సాబెరా బేగం, రేష్మా బాను తదితరులు పాల్గొన్నారు.